Sun Mar 15 2026 07:19:03 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమలలో మార్పులంటూ వస్తున్న వార్తలు నమ్మొద్దు : టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారంటూ వస్తున్న వార్తలు నమ్మవద్దని టీటీడీ స్పష్టం చేసింది.

తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారంటూ వస్తున్న వార్తలు నమ్మవద్దని టీటీడీ స్పష్టం చేసింది. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు లడ్డూ ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపింది. టీటీడీ ధరలను సవరించిందని పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నిజం కాదని ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపింది.
ప్రత్యేక దర్శనం టిక్కెట్లు...
టీటీడీ తిరుమల శ్రీవారి మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు 50 రూపాయల లడ్డూ ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని టీటీడీ స్పష్టం చేసింది. పలు సామాజిక మాధ్యమాలలో శ్రీవారి లడ్డు ధరలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం ధరలును టీటీడీ సవరించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని భక్తులు వీటిని నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.
Next Story

