Wed Dec 17 2025 14:07:32 GMT+0000 (Coordinated Universal Time)
నడకమార్గం భక్తులకు గుడ్న్యూస్
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. నడకమార్గం నుంచి వెళ్లే భక్తులకు దర్శన టోకెన్లు జారీ చేయనుంది

తిరుమల వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. నడకమార్గం నుంచి వెళ్లే భక్తులకు దర్శన టోకెన్లు జారీ చేయనుంది. ఏప్రిల్ ఒకటోతేదీ నుంచి నడక మార్గంలో భక్తులకు దర్శన టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. అలిపిరి నడక మార్గంలో వచ్చిన పది వేల మంది భక్తులకు, శ్రీవారి మెట్ల మార్గంలో వచ్చిన ఐదువేల మంది భక్తులకు టోకెన్లు జారీ చేయనున్నారు.
ఏప్రిల్ 1 నుంచి..
కరోనా సమయంలో నడకమార్గంలో వచ్చే భక్తులకు దర్శన టోకెన్లను నిలిపేశారు. అనంతరం దానిని పునరుద్ధరించలేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. రేపు శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం జరగనుంది. రేపు సాయంత్రం హనుమంత వాహనంపై స్వామి వారు ఊరేగుతారు. ఎల్లుండి శ్రీరామపట్టాభిషేకం జరగనుంది.
Next Story

