Mon Mar 16 2026 03:15:43 GMT+0530 (India Standard Time)
జగన్ కు ఆహ్వానం
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి నివాసంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు.

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి నివాసంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి శ్రీ సీతారామ కళ్యాణ ఆహ్వన శుభపత్రికను అందజేశారు. టీటీడీ ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి, ఈవో ఏ.వి. ధర్మారెడ్డి ముఖ్యమంత్రికి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
బ్రహ్మోత్సవాలు...
ఏప్రిల్ ఐదో తేదీన రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఒంటిమిట్టలో జరగనుంది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు రావాలని కోరారు.
Next Story

