Wed Mar 25 2026 07:19:44 GMT+0530 (India Standard Time)
లింక్ రోడ్డు నుంచి తిరుమలకు అనుమతి
తిరుమలకు లింకు రోడ్డు నుంచి వాహనాలకు టీటీడీ అనుమతించింది. లింక్ రోడ్డు నుంచి తిరుమలకు వాహనాలను అనుమతిస్తున్నారు.

తిరుమలకు లింకు రోడ్డు నుంచి వాహనాలకు టీటీడీ అనుమతించింది. లింక్ రోడ్డు నుంచి తిరుమలకు వాహనాలను అనుమతిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుమల రెండు ఘాట్ రోడ్లు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. కొండచరియలు విరిగిపడటం, కొన్ని చోట్ల రోడ్లు దెబ్బతినడంతో కొన్ని రోజులుగా రెండు ఘాట్ రోడ్లను మూసివేశారు. అయితే తాత్కాలికంగా ఒక ఘాట్ రోడ్డు నుంచి వాహనాలకు అనుమతించారు.
దెబ్బతిన్న ఘాట్ రోడ్లను....
ఇప్పటికే దెబ్బతిన్న తిరుమల ఘాట్ రోడ్లను ఢిల్లీలోని ఐఐటీ నిపుణులు పరిశీలించారు. రక్షణ గోడలను పటిష్టం చేయడం, రోడ్ల మరమ్మతులు, వాటి నాణ్యతను పరిశీలించిన ఐఐటీ బృందం టీటీడీకి కొన్ని సూచనలు చేసింది. ఒక రోడ్డు నుంచే వాహనాల రాకపోకలు కొనసాగుతుండటంతో ప్రమాదమని గ్రహించిన టీటీడీ లింక్ రోడ్డు నుంచి తిరుమలకు వాహనాలను అనుమతించింది.
Next Story

