Sat Mar 07 2026 15:38:04 GMT+0530 (India Standard Time)
జగన్ పై రాయి దాడి కేసు.. విచారణ వాయిదా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై రాయి దాడి కేసు విచారణ వాయిదా పడింది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై రాయి దాడి కేసు విచారణ వాయిదా పడింది. ఎం జగన్పై రాయితో దాడి చేసిన నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్ను సోమవారం విజయవాడ కోర్టు విచారించింది. వాదనలకు సమయం కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను వచ్చే నెల 23కు వాయిదా వేశారు.
సతీష్ బెయిల్ పిటీషన్ పై...
విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొన్న జగన్పై గత నెలలో నిందితుడి రాయి దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సతీష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి చేసి హత్యా యత్నానికి పాల్పడ్డాడని సతీష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సతీష్ బెయిల్ పిటీషన్ ను న్యాయస్ధానం వాయిదా వేసింది.
Next Story

