Fri Dec 05 2025 12:38:03 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలిక్కర్ కేసులో నేడు కోర్టు విచారణ
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో విచారణ కొనసాగుతుంది. నేడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు కస్టడీ పిటిషన్లపై న్యాయస్థానం విచారించనుంది.

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో విచారణ కొనసాగుతుంది. నేడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు కస్టడీ పిటిషన్లపై న్యాయస్థానం విచారించనుంది.ఈరోజు నిందితుల బెయిల్ పిటీషన్ లపైనా న్యాయస్థానం విచారించనుంది. ఈరోజు ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై కూడా విచారించనుంది.
వైసీపీ నేతల క్వాష్ పిటీషన్ పై...
మరోవైపు సింగయ్య మృతి కేసుకు సంబంధించి నేడు హైకోర్టులో మాజీ సీఎం వైఎస్ జగన్, వైవీసుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజనీల క్వాష్ పిటీషన్ పై విచారణ జరగనుంది. జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య మృతి కేసులో వీరిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో తమపై నమోదయిన కేసును క్వాష్ చేయాలని పిటీషన్ వేశారు.
Next Story

