Thu Jan 08 2026 06:24:11 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ట్రావెల్స్ బస్సు దగ్దం
ఆంధ్రప్రదేశ్ లో ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురయింది

ఆంధ్రప్రదేశ్ లో ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురయింది. ట్రావెల్స్ బస్సుకు మంటలు అంటుకుని కాలి బుడిదయింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ముప్పు తప్పింది. ఆర్ఆర్ఆర్ ట్రావెల్స్ బస్సు ఖమ్మం నుంచి విశాఖకు బయలుదేరింది. అయితే తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు గామన్ బ్రిడ్జివద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. అయితే ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి.
షార్ట్ సర్క్చూట్ కారణంగానే...
షార్ట్ సర్క్చూట్ కారణంగానే మంటలు వచ్చాయని తెలిపారు. బస్సు మొత్తం దగ్దం అయింది. మంటల్ని గుర్తించిన బస్సు డ్రైవర్ వెంటనే బస్సును నిలిపేసి ప్రయాణికులను కిందకు దింపేశాడు. అయితే ప్రమాద సమయంలో బస్సులో ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారని చెబుతున్నారు. రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. అగ్నిమాపక శకటం వచ్చి మంటలను ఆర్పింది. వేరే బస్సులో ప్రయాణికులను తరలించారు.
Next Story

