Sat Mar 21 2026 11:40:04 GMT+0530 (India Standard Time)
అగ్ని కీలల్లో ట్రావెల్స్ బస్సు
విజయనగరం జిల్లాలో ఓ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది

విజయనగరం జిల్లాలో ఓ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. రామభద్రపురం మండలం తారాపురం వద్ద భువనేశ్వర్ నుంచి మల్కాన్గిరి వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు వెనక టైర్ పేలడంతో ప్రమాదం సంభవించింది. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్.. ప్రయాణికులను దించివేశారు.
తప్పిన ప్రాణ నష్టం...
దీంతో ప్రాణ నష్టం తప్పింది. మంటల ధాటికి బస్సు పూర్తిగా దహనమైంది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్లో ఒడిశాకు చెందిన ఎమ్మెల్యే ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
Next Story

