Tue Jan 20 2026 08:15:17 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమల క్యూ లైన్ లోనే గుండెపోటుతో మహిళ మృతి
తిరుమలలో విషాద ఘటన జరిగింది. గుండెపోటుతో భక్తురాలు మృతి చెందింది

తిరుమలలో విషాద ఘటన జరిగింది. గుండెపోటుతో భక్తురాలు మృతి చెందింది. సర్వదర్శనం క్యూలైన్ లోకి వెళుతుండగా ఒక్కసారి గుండెనొప్పితో పడిపోయింది. ఈరోజు తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే భక్తులు సీపీఆర్ చేశారు. టీటీడీ డిస్పెన్సరీ నర్సులు వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందినట్లు చెబుతున్నారు.
కడప జిల్లాకు చెందిన...
మృతురాలు కడప జిల్లా కు చెంది ఝాన్సీగా గుర్తించారు. ఆమె వయసు 32 ఏళ్లు. కుటుంబంతో కలసి తిరుమల శ్రీవారి దర్శనానికి రాగా ఆమె మృతిచెందడం కలచివేసింది. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారని, రుయా ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోనూ వైద్యుడితో పాటు అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు.
Next Story

