Mon Mar 23 2026 01:24:12 GMT+0530 (India Standard Time)
నాలుగు ఏనుగులు మృతి
మన్యం జిల్లాలో విషాద ఘటన జరిగింది. బామిని కాట్రగడ్డలో నాలుగు ఏనుగులు మృతి చెందాయి.

మన్యం జిల్లాలో విషాద ఘటన జరిగింది. బామిని కాట్రగడ్డలో నాలుగు ఏనుగులు మృతి చెందాయి. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ వైపునకు ఆరు ఏనుగులు వచ్చాయి. తివ్వాకొండ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్తు తీగ తగిలి నాలుగు ఏనుగులు మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు.
విద్యుత్తు షాక్ తగిలి...
నాలుగు ఏనుగులు మృతి చెందడంపై జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాలను కాపాడుకునేందుకు విద్యుత్తు తీగలను అమర్చడంతోనే ఈ ప్రమాదం జరిగిందని కొందరు ఆరోపిస్తున్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధకిారులను కోరుతున్నారు.
Next Story

