Sun Mar 15 2026 14:05:49 GMT+0530 (India Standard Time)
Breaking : విజయవాడలో విషాదం.. కొండచరియలు విరిగి పడి యువతి మృతి
విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి ఒక యువతి మృతి చెందింది. మృతురాలు మేఘనగా గుర్తించారు

విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి ఒక యువతి మృతి చెందింది. మృతురాలు మేఘనగా గుర్తించారు. మరో ఇద్దరి కోసం రెస్య్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది. విజయవాడలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. భారీ వర్షానికి కొండరాళ్లు ఇళ్లపై పడుతున్నాయి.
నాలుగు ఇళ్లు ధ్వంసం...
మొగల్రాజపురం సున్నపుబట్టీల సెంటర్ లో కొండచరియలు విరిగిపడి నాలుగు ఇళ్లు దెబ్బతిన్నాయి. ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఆ ఇంట్లో ఉన్న మరో ఇద్దరు కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు. కొండకు దిగువ ప్రాంతంలో ఉన్న వారిని నివాసాల నుంచి ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
Next Story

