Fri Dec 05 2025 10:51:43 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : పెంచలకోన జలపాతంలో 11 మంది గల్లంతు
నెల్లూరు జిల్లా పెంచలకోన జలపాతం వద్ద విషాదం చోటు చేసుకుంది. మొత్తం పదకొండు మంది గల్లంతయినట్లు సమాచారం.

నెల్లూరు జిల్లా పెంచలకోన జలపాతం వద్ద విషాదం చోటు చేసుకుంది. మొత్తం పదకొండు మంది గల్లంతయినట్లు సమాచారం. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వరద ఉధృతికి పదకొండు మంది పర్యాటకులు కొట్టుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. రోప్ లతో పోలీసులు వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారని అందుతున్న సమచారాన్ని బట్టి తెలుస్తోంది.
పర్యాటకులు ఎవరనేది?
పెంచలకోన జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన పర్యాటకులు అందులోకి దిగి నీటి ఉదృతికి కొట్టుకుపోయారని చెబుతున్నారు. అయితే వారంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు? అన్న సమాచారం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. వారిలో మహిళలు కూడా ఉన్నట్లు ప్రాధమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మునిగిపోతున్న వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరికొందరు వరద ఉధృతికి కొట్టుకుపోయారని మరొక కథనం వినిపిస్తుంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story

