Sun Mar 08 2026 01:04:15 GMT+0530 (India Standard Time)
ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంట విషాదం
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి చెవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి మరణించారు.

చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి చెవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి మరణించారు. ఆయన కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. హఠాత్తుగా నిన్న అర్ధరాత్రి ఊపిరిపీల్చడం సమస్యగా మారడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్విమ్స్ కు తరలించారు. అయితే వైద్యులు ఎంత ప్రయత్నించినా సుబ్రమణ్య రెడ్డి కోలుకోలేదు. ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
పీసీసీ కార్యదర్శిగా...
సుబ్రమణ్య రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ కార్యదర్శిగా పనిచేశారు. రాజకీయంగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మరణంతో చెవిరెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది. సుబ్రమణ్యరెడ్డికి భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. ముగ్గురిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్ద. సుబ్రమణ్యరెడ్డి మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతిని ప్రకటించారు.
Next Story

