Thu Apr 09 2026 20:07:18 GMT+0530 (India Standard Time)
అల్లూరి జిల్లాలో విషాదం.. ముగ్గురి మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది

అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అనంతగిరి పాత్ర మూలగుమ్మిలో జలపాతంలో పడి ముగ్గురు చనిపోయారు. సెల్ఫీ తీసుకుంటుండగా నలుగురు బాలికలు జలపాతంలో పడిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు బాలికలు మరణించారని పోలీసులు తెలిపారు.
జలపాతంలో పడి...
సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు పోలీసులు చేరుకుని బాలికలను రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే ముగ్గురు బాలికలు మరణించగా మరో బాలిక పరిస్థితి విషమంగా ఉండగా, స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారు హుకుంపేట మండలం జుంబువలసకు చెందిన వారిగా పోలీసులు పేర్కొన్నారు
Next Story

