Thu Mar 12 2026 15:42:37 GMT+0530 (India Standard Time)
హోలీ పండగ వేళ విషాదం
నరసరావుపేట మండలం బసికాపురంలో హొలీ వేడుకల్లో విషాదం నెలకొంది.

నరసరావుపేట మండలం బసికాపురంలో హొలీ వేడుకల్లో విషాదం నెలకొంది. హొలీ వేడుకల సందర్భంగా నీటిగుంటలో ఈతకి దిగిన నలుగురు స్నేహితుల్లో ఒకరు కనిపించకుండా పోయారు. కాసేపటి తర్వాత ముగ్గురు స్నేహితులు ఒడ్డుకు చేరుకున్నారు. హోలీ పండగ సందర్భంగా రంగులతో ఆడుకున్న తర్వాత స్నానం చేయడానికి నీటి కుంటలోకి ముగ్గురు స్నేహితులు దిగారు.
నీటిగుంటలో మునిగి...
నీటిగుంటలో మునిగి గ్రామానికి చెందిన ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి గోపి గల్లంతయినట్లు స్థానికులు తెలిపారు. గోపి వయసు పదహారు సంవత్సరాలు. నీటిగుంట వద్ద గోపి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పండుగ రోజు విద్యార్థి గల్లంతు అవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు వచ్చి ఈతగాళ్లను రప్పించి గోపీ కోసం గాలింపు చర్యలను చేపట్టారు.
Next Story

