Mon Apr 06 2026 09:53:10 GMT+0530 (India Standard Time)
కడప జిల్లాలో విషాదం.. పెన్నా నదిలో ముగ్గురు గల్లంతు
కడప జిల్లాలో విషాదం నెలకొంది

కడప జిల్లాలో విషాదం నెలకొంది. కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి వద్ద ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. పెన్నా నదిలో స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతైనట్టు సమాచారం. ఇందులో ఒకరి మృతదేహం లభ్యం కాగా, మరో ఇద్దరి కోసం సిబ్బంది గాలింపు చర్యలను చేపట్టారు.
ముగ్గురు యువకులు...
ముగ్గురు యువకులూ కడపకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. పెన్నా నదిలో స్నానానికి దిగిన వారు గల్లంతయినట్లు సమాచారం అందడంతో పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
Next Story

