Wed Mar 18 2026 18:17:37 GMT+0530 (India Standard Time)
పొట్టేలు అనుకుని మనిషి తల నరికేశాడే?
చిత్తూరు జిల్లా మదనపల్లిలో విషాదం చోటు చేసుకుంది.

చిత్తూరు జిల్లా మదనపల్లిలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి పొట్టేలు తల అనుకుని మనిషి తలను నరికేశాడు. ఈ ఘటన మదనపల్లి మండలం వలసపల్లె గ్రామంలో జరిగింది. మూఢనమ్మకాలు ఒక మనిషి ప్రాణాన్ని తీశాయి. ఆచారాల ప్రకారం దేవుడికి పొట్టేలును బలి ఇవ్వాల్సి ఉంది.
ఆసుపత్రిలో....
ఈ క్రమంలో పొట్టేలును కూడా సిద్దం చేశారు. అయితే చలపతి అనే వ్యక్తి ఫుల్లుగా మద్యం తాగి పొట్టేలు అనుకుని సురేష్ అనే యువకుడి తలను నరికేశాడు. సురేష్ కు తీవ్ర గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సురేష్ మరణించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

