Sat Mar 07 2026 17:33:25 GMT+0530 (India Standard Time)
దేవర సినిమా చూస్తు కుప్పకూలిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని
దేవర సినిమా విడుదలయిన రోజు కడప జిల్లాలో విషాదం జరిగింది. కడప జిల్లా జమాన్పల్లిలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మస్తాన్వలి మరణించారు

దేవర సినిమా విడుదలయిన రోజు కడప జిల్లాలో విషాదం జరిగింది. కడప జిల్లా జమాన్పల్లిలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మస్తాన్వలి మరణించారు. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ నటించిన కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయిన సంగతి తెలిసిందే.
కేకలు వేస్తూ...
అయితే తొలిరోజు షో చూడాలని మస్తాన్వలి సినిమా థియేటర్ కు వెళ్లాడు. అయితే తన అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ను స్క్రీన్ మీద చూసిన వెంటనే మస్తాన్వలి కేకలు వేస్తూ కాసేపటికి కుప్పకూలిపోయాడు. పక్కన స్నేహితులు లేపినా లేవలేదు. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మస్తాన్వలి మరనించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో విషాదం నెలకొంది.
Next Story

