Sat Mar 14 2026 21:26:12 GMT+0530 (India Standard Time)
విషాదం.. ఏనుగు మృతి
చిత్తూరు జిల్లా ధర్మపురిలో విషాదం జరిగింది. విద్యుత్తు తీగలు తగిలి ఒక ఏనుగు మరణించింది.

చిత్తూరు జిల్లా ధర్మపురిలో విషాదం జరిగింది. విద్యుత్తు తీగలు తగిలి ఒక ఏనుగు మరణించింది. పంట పొలాల్లోకి వచ్చిన ఏనుగు వెళుతుండగా కింద ఉన్న విద్యుత్తు తీగలు తగులుకుని అక్కడికక్కడే మరణించింది. అయితే దీనిపై అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్తు తీగలు తగిలి...
విద్యుత్తు తీగలు అంత కిందకు వేలాడుతుండటం వల్లనే ఏనుగు మరణించిందని అటవీ శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. విద్యుత్తు శాఖ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
Next Story

