Sun Mar 08 2026 00:04:44 GMT+0530 (India Standard Time)
టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇంట విషాదం
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమారుడు చంద్రమౌళి గుండెపోటుతో మరణించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమారుడు చంద్రమౌళి గుండెపోటుతో మరణించారు. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చంద్రమౌళికి ఇటీవల వివాహం నిశ్చయమైంది. వచ్చే నెలలో వివాహం నిశ్చయమైంది. ఆయన దానికి సంబంధించిన కార్యక్రమాలను చూసుకునేందుకు ఆదివారం చెన్నైలో ఉండగా గుండె పోటు వచ్చింది. శుభలేఖలను పంచుతుండగా గుండెలో నొప్పి అనిపించడంతో పక్కన ఉన్న తన స్నేహితుడికి చెప్పాడు. వెంటనే ఆయనను చెన్నై లోని కావేరి ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మరణించారు.
28 ఏళ్ల వయసులోనే...
చంద్రమౌళి వయసు 28 సంవత్సరాలు. ఆయన ముంబయిలో ఉద్యోగం చేస్తున్నారని తెలిసింది. చంద్రమౌళికి త్వరలో వివాహం జరుగుతుందనకున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. రెండు కుటుంబాలకు చెందిన వారు విషాదంలో మునిగిపోయారు. ధర్మారెడ్డి కుటుంబానికి అనేక మంది తమ సంతాపాన్ని, సానుభూతిని తెలియచేస్తున్నారు.
Next Story

