Fri Mar 20 2026 04:21:09 GMT+0530 (India Standard Time)
Breaking : దేవినేని ఉమ ఇంట విషాదం.. సోదరుడి మృతి
మాజీ మంత్రి దేవినేని ఉమ ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు దేవినేని చంద్రశేఖర్ రావు మరణించారు

మాజీ మంత్రి దేవినేని ఉమ ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు దేవినేని చంద్రశేఖర్ రావు మరణించారు. ఆయన కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. గత నాలుగు రోజుల నుంచి హైదరాబాద్ లోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఆయన ఆరోగ్యం విషమించడంతో మరణించారని దేవినేని ఉమ కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇద్దరు సోదరులు...
మూడు రోజుల నుంచి దేవినేని ఉమ హైదరాబాద్ లో తన సోదరుడి వద్దనే ఉంటున్నారు. ఈరోజు దేవినేని చంద్రశేఖర్ భౌతిక కాయాన్ని కంచికచర్లకు తరలించనున్నారు. దేవినేని ఉమ మరోసోదరుడు దేవినేని రమణ రైలు ప్రమాదంలో మరణించారు. ఇప్పుడు మరో సోదరుడు కూడా మరణించడంతో ఆయన ఇంట తీవ్ర విషాదం నెలకొంది.
Next Story

