Thu Jan 29 2026 10:22:54 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్కే బీచ్ లో విషాదం.. న్యూ ఇయర్ వేడుకలకు వచ్చి 6గురు గల్లంతు
స్నేహితులతో కలిసి ఆర్కే బీచ్ కు వచ్చిన ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ కు చెందిన 8 మంది యువకులు

కొత్త సంవత్సరం.. మొదటి రోజే ఆర్కే బీచ్ లో విషాదం నెలకొంది. న్యూ ఇయర్ వేడుకలను జరుపుకునేందుకు స్నేహితులతో కలిసి ఆర్కే బీచ్ కు వచ్చిన ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ కు చెందిన 8 మంది యువకులు న్యూ ఇయర్ వేడుకలను జరుపుకునేందుకు ఆదివారం మధ్యాహ్నం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ కు చేరుకున్నారు. అక్కడ సముద్రపు నీటిలో ఆడుకుంటూ ఉండగా.. పెద్ద కెరటాలు రావడంతో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు.
Also Read : 18 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సాప్
ఈ ఘటనను గమనించిన లైఫ్ గార్డ్స్ కొద్దిసేపటికి శివ అనే యువకుడిని ఒడ్డుకి చేర్చి, ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మరణించారు. బీచ్ లో గల్లంతైన మరో ఇద్దరు.. హైదరాబాద్ బేగంపేటకు చెందిన కె. శివ, మహ్మద్ అజీజ్ ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా.. ఒడిశాకు చెందిన మరో ఐదుగురు కూడా గల్లంతైనట్లు తెలుస్తోంది. వారిలో సునీత త్రిపాఠి అనే యువతి ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. సునీత, శివ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు.
Next Story

