Tue Jan 20 2026 21:31:40 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి బంద్
విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలు కిలోమీటర్ల మేరకు నిలిచిపోయాయి

విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలు కిలోమీటర్ల మేరకు నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద పాలేరు బ్రిడ్జిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనాలు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్లడం లేదు. వర్షం దెబ్బకు గరికపాడు వద్ద వంతెన దెబ్బతినింది.
నిలిచిపోయిన....
పోలీసులు జాతీయ రహదారిపై వాహనాలను అనుమతించడం లేదు. ఇప్పటికే వచ్చిన వాహనాలను పక్కనే నిలిపేస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వంతెన వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరూ వంతెన దాటే ప్రయత్నం చేయవద్డంటూ మైకుల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వంతెన మరమ్మతుల తర్వాత మాత్రమే వాహనాలను అనుమతించే అవకాశముంది.
Next Story

