Sat Mar 07 2026 19:36:51 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ - విజయవాడ హైవే పై ట్రాఫిక్ రద్దీ
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్థంభించింది. కొర్ల పహాడ్ టోల్ గేట్ వద్ద కార్లు ఢీకొన్నాయి

హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్థంభించింది. కొర్ల పహాడ్ టోల్ గేట్ వద్ద కార్లు ఢీకొన్నాయి. మూడు కార్లు ధ్వంసమయ్యాయి. దీంతో ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. పొగమంచు కారణంగానే వాహనాలు ఢొకొన్నట్లు తెలిసింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలను పునరుద్ధరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సంక్రాంతి సెలవులకు...
సంక్రాంతి సెలవులకు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు ప్రజలు బయలుదేరి వెళుతుండటంతో ఉదయం నుంచి వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. టోల్ ప్లాజా సిబ్బంది కూడా ఎక్కువ ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు. అయినా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటంతో పరిస్థితిని నియంత్రించడం కష్టంగా మారింది. తెలంగాణ నుంచి ఏపీలోని సొంతూళ్లకు వెళుతుండటంతో రద్దీ నెలకొంది.
Next Story

