Sun Jan 11 2026 02:13:23 GMT+0000 (Coordinated Universal Time)
నందిగామ వై-జంక్షన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద వై-జంక్షన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది

ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద వై-జంక్షన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో వాహనాల రద్దీ పెరిగింది. హైవే సర్వీస్ రోడ్డుపై గుంతల కారణంగా వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనదారులు నందిగామ వై-జంక్షన్ వద్ద ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలతో కీసర టోల్ ప్లాజా కిటకిటలాడుతోంది.
ఎల్లుండి వరకూ...
సంక్రాంతి పండగకు వెళ్లే వారితో జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. నిన్న రాత్రి నుంచి ప్రారంభమైన వాహనాల రద్దీ ఎల్లుండి వరకూ కొనసాగే అవకాశముంది. టోల్ ప్లాజాల వద్ద హైదరాబాద్ నుంచి విజయవాడ వైపునకు వెళ్లే రూట్లో ఎక్కువ టోల్ బూత్ లను టోల్ నిర్వాహకులు తెరిచారు.హైదరాబాద్ కు వచ్చే వాటిని తగ్గించారు. వాహనాల రద్దీకి తగినట్లు టోల్ ప్లాజా నిర్వాహకులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
Next Story

