Sun Mar 15 2026 18:03:32 GMT+0530 (India Standard Time)
మదనపల్లిలో కిలో టమాటా ఎంతో తెలుసా?
మదనపల్లిలో టమాటా ధర రికార్డు స్థాయికి చేరుకుంది. మదనపల్లిలో కిలో టమాటా ధర రూ.150లకు పలుకుతుంది

మదనపల్లిలో టమాటా ధర రికార్డు స్థాయికి చేరుకుంది. మదనపల్లిలో కిలో టమాటా ధర రూ.150లకు పలుకుతుంది. మదనపల్లి మార్కెట్ నుంచి టమాటాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే ఈరోజు చిత్తూరు జిల్లా వి.కోట మార్కెట్ లో టమాటా ధర 150 రూపాయలు అయింది. పది కిలోల టామాటా బాక్స్ రూ.1500లు పలికింది. వ్యాపారులు పోటీ పడి మరీ కొనుగోలు చేస్తున్నారు.
ఒక్కోసారి రోడ్లపై పోసి...
టమాటాకు మదన పల్లి మార్కెట్ ఫేమస్. ఒక్కో సీజన్ లో ఇక్కడ టమాటాకు గిట్టుబాటు ధర రాక రైతులు రోడ్లపై పారబోస్తుంటారు. కానీ కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు టమాటా పంట నష్టపోయింది. దిగుబడి తగ్గింది. దీంతో ఉన్న టమాటాకు డిమాండ్ పెరిగింది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
Next Story

