Sun Mar 22 2026 21:39:55 GMT+0530 (India Standard Time)
బిగ్ రిలీఫ్.. దిగి వస్తున్న టమాటా
తాజాగా టమాటా ధరలు మరింత దిగి వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్ లో కిలో టమాటా ధర 38 రూపాయలకు లభిస్తుంది.

నిన్న మొన్నటి వరకూ టామాటా ధర కిలో వంద రూపాయలకు పైగానే పలికింది. దీంతో వినియోగదారులు బెంబేలెత్తి పోయారు. టమాటా వంటింట్లో అతి ముఖ్యమైన కూరగాయ కావడంతో ఎక్కువ ధర పెట్టైనా కొనుగోలు చేసేందుకు సిద్ధపడతారు. వంద రూపాయల కిలో టమాటా ధర మొన్న, నిన్న వరకూ 70 రూపాయల వరకూ పలికింది. అయితే తాజాగా టమాటా ధరలు మరింత దిగి వచ్చాయి.
దిగుబడి పెరగడంతో...
ప్రస్తుతం మార్కెట్ లో కిలో టమాటా ధర 38 రూపాయలకు లభిస్తుంది. దీంతో వినియోగదారులకు పెద్ద ఊరట లభించిందనే చెప్పాలి. టమాటా దిగుబడి పెరగడం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి కావడంతో ధరలు తగ్గుముఖం పట్టాయని వ్యాపారులు చెబుతున్నారు.
Next Story

