Sun Mar 15 2026 18:00:36 GMT+0530 (India Standard Time)
టమాటా ధరకు మళ్లీ రెక్కలు
టమాటా ధరలకు మళ్లీ పెరుగుతున్నాయి. కిలో టమాటా నేడు 80 రూపాయలకు చేరుకుంది.

టమాటా ధరలకు మళ్లీ పెరుగుతున్నాయి. కిలో టమాటా నేడు 80 రూపాయలకు చేరుకుంది. మదనపల్లి మార్కెట్ లో ఈ ధరలు కన్పిస్తున్నాయి. దీంతో పాటు రామకుప్పం తదితర ప్రాంతాల్లో కూడా టమాటా ధర పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి అతి తక్కువ మంది టమాటాను సాగు చేశారు. దిగుబడి తగ్గడంతో టమాటా ధర కూడా పెరిగిందని వ్యాపారులు, రైతులు చెబుతున్నారు.
దిగుబడి తగ్గడంతో.....
వర్షాల కారణంగా టామాటా దిగుబడి తగ్గిపోయందంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా టామాటా దిగుమతి సక్రమంగా జరగడం లేదు. దీంతో టమాటా ధరకు రెక్కలు వచ్చాయి. మార్కెట్ లో కిలో టమాటా 80 రూపాయల వరకూ విక్రయిస్తున్నారు. దీనిపై వినియోగదారుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది.
Next Story

