Sun Mar 15 2026 18:03:37 GMT+0530 (India Standard Time)
ఒక్కసారిగా కుప్పకూలిన టమాటా మార్కెట్
ఆంధ్రప్రదేశ్ లో టమాటా మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. టమాటా ధరలు పడిపోయాయి.

ఆంధ్రప్రదేశ్ లో టమాటా మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. టమాటా ధరలు పడిపోయాయి. నిన్నట ివరకూ కేజీ 130 రూపాయలు వరకూ పలికిన టమాటా ధరలు నేడు అరవై రూపాయలకు పడిపోయాయి. మదనపల్లి మార్కెట్ లో నేడు ఏగ్రేడ్ టమాటా ధర అరవై రూపాయలకు పడిపోయింది. బిగ్రేడ్ 10 రూపాయలకు చేరుకుంది. పత్తికొండ ప్యాపిలి మార్కెట్ లో కేజీ ఇరవై ఏడు రూపాయలకు పడిపోయింది.
దిగుమతి....
కర్నూలు మార్కెట్ లో కేజీ టమాటా ధర 30 రూపాయలుగా ఉంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి టమాటాను దిగుమతి చేసుకోవడంతో ఒక్కసారిగా టమాటా ధరలు పడిపోయాయి. నిన్నటి వరకూ 130 రూపాయలు కేజీ పలికిన టమాటా ధర పడిపోవడంతో రైతులు నిరాశపడ్డారు.
Next Story

