Mon Feb 02 2026 04:45:31 GMT+0000 (Coordinated Universal Time)
వరద బాధితులకు అండగా టాలీవుడ్
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల వరదలకు జరిగిన నష్టంపై టాలీవుడ్ స్పందించింది.

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల వరదలకు జరిగిన నష్టంపై టాలీవుడ్ స్పందించింది. మెగాస్టార్ చిరంజీవి ఇరవై ఐదు లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. అలాగే చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా 25 లక్షలు ప్రకటించారు. మెగా ఫ్యామిలీ వరద బాధితులకు 50 లక్షలు ప్రకటించినట్లయింది. ఈ మొత్తాన్ని ఏపీ ప్రభుత్వ సహాయనిధికి ఇస్తున్నట్లు చిరు ఫ్యామిలీ ప్రకటించింది.
మహేష్.. జూనియర్ ఎన్టీఆర్....
హీరో మహేష్ బాబు కూడా సీఎం సహాయనిధికి 25 లక్షలను ప్రకటించారు. దీంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ సయితం తన వంతుగా ఇరవై ఐదు లక్షలు విరాళం ప్రకటించారు. టాలీవుడ్ మొత్తం వరద బాధితులకు అండగా నిలుస్తుంది.
Next Story

