Fri Dec 05 2025 19:56:24 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ ను కలిసి వచ్చిన తర్వాత అల్లు అరవింద్ ఏమన్నారంటే?
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ తో టాలీవుడ్ నిర్మాతలు భేటీ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ తో టాలీవుడ్ నిర్మాతలు భేటీ అయ్యారు. ఏపీలో సినీరంగం విస్తరణకు సంబంధించిన అంశాలపై వారు చర్చిస్తున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న సినీనిర్మాతలు అక్కడి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత అక్కడకు చేరుకున్న సిననీ నిర్మాతలు ఆయనతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ముందుగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయినందుకు టాలీవుడ్ నిర్మాతలు శుభాకాంక్షలు అందచేశారు. చిత్రపరిశ్రమ నుంచి అత్యున్నత స్థాయికి ఎదగడం పట్ల వాళ్లు అభినందించారు.
సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న...
దీంతో పాటు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను, సవాళ్లను పవన్ దృష్టికి తీసుకెళ్లారు. పవన్ ను కలసిన వారిలో టాలీవుడ్ నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, దగ్గుబాటి సురేష్ బాబు, ఏఎం రత్నం, ఎస్. రాధాకృష్ణ, దిల్ రాజు, ఎన్వీ ప్రసాద్, భోగపల్లి ప్రసాద్, బన్నీవాసు, డీవీవీ దానయ్య, నాగవంశీ, వంశీకృష్ణ, రవిశకంర్, యర్నేని నవీన్ ఉన్నారు. త్వరలోనే సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై ముఖ్యమంత్రిచంద్రబాబును కలసి చర్చిస్తామని, ఇందుకు అపాయింట్మెంట్ ఇప్పించాలని పవన్ కల్యాణ్ ను కోరినట్లు అల్లు అరవింద్ తెలిపారు. త్వరలోనే అపాయింట్మెంట్ ఇప్పిస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చినట్లు అల్లు అరవింద్ తర్వాత మీడియాకు తెలిపారు.
Next Story

