Fri Dec 05 2025 15:53:56 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబుతో సినీ ప్రముఖుల భేటీ నేడు వాయిదా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నేడు సినీ ప్రముఖల సమావేశం వాయిదా పడింది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నేడు సినీ ప్రముఖల సమావేశం వాయిదా పడింది. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు చంద్రబాబు నాయుడుతో 35 మంది సినీ ప్రముఖులు సమావేశమవ్వాలని భావించారు. ఇందుకు సంబంధించిన జాబితా కూడా తయారయింది. చంద్రబాబు కంటే ముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కలిసేందుకు కూడా నిర్ణయించారు. ముందుగా ఈ నెల 22వ తేదీన భేటీ కావాలనుకున్నప్పటికీ, పదిహేనో తేదీకి ఫిక్స్ చేశారు.
షూటింగ్ ల కారణంగా...
అయితే నేటి సమావేశం వాయిదా పడింది. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులకు నేడు షూటింగ్ లలో ఉండటంతో సమావేశాన్ని వాయిదా వేసుకున్నారని తెలిసింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మర్యాదపూర్వక భేటీ అని చెప్పారు. ప్రముఖులు షూటింగ్ ల కారణంగా ఇతర ప్రాంతాల్లో ఉండటంతో సమావేశం వాయిదా పడింది. తిరిగి సమావేశమయ్యే తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.
Next Story

