Sun Mar 15 2026 11:12:44 GMT+0530 (India Standard Time)
ఏపీ సీఎం జగన్ తో దర్శకుడు ఆర్జీవీ భేటీ.. ఇంతకీ ఎందుకు?
ఏ విషయాన్నైనా ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో పంచుకునే ఆర్జీవీ.. జగన్ తో భేటీ విషయాన్ని చెప్పకపోవడం గమనార్హం.

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యారు. ఏ విషయాన్నైనా ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో పంచుకునే ఆర్జీవీ.. జగన్ తో భేటీ విషయాన్ని చెప్పకపోవడం గమనార్హం. బుధవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని నివాసంలో వర్మ.. జగన్ తో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఇద్దరూ సమావేశమయ్యారు. వర్మకు సీఎం జగన్ లంచ్ ఆతిద్యమిచ్చినట్లు తెలిసింది.
కాగా.. వర్మ.. సీఎం జగన్ లు ఎందుకు సమావేశమయ్యారు ? ఏ విషయాలపై చర్చించుకున్నారు ? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఏపీలో సినిమా రంగానికి సంబంధించిన అభివృద్ధి గురించి చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా.. మూడు రాజధానులపై వర్మ సినిమా తీసేందుకు జగన్ కలిశారని ప్రచారం జరుగుతోంది. వీరి సమావేశంపై వర్మ చెబితేనే గాని.. ఏం జరిగిందన్నది తెలిసే ఛాన్స్ లేదు.
Next Story

