Mon Dec 08 2025 21:51:27 GMT+0000 (Coordinated Universal Time)
ఎగిరొచ్చినంత సేపు లేదు.. మాట్లాడింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ ముగిసింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ ముగిసింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ దాదాపు గంట పాటు కొనసాగింది. సినిమా పరిశ్రమలో నెలకొన్న సమస్యలతో పాటు టిక్కెట్ల ధరలపై కూడా ముఖ్యమంత్రి జగన్ తో టాలీవుడ్ ప్రముఖులు చర్చించారు.
సానుకూలంగా...
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. సినిమా టిక్కెట్ల ధరలపై ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక అందిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని జగన్ వారికి చెప్పినట్లు తెలిసింది. సినీ పరిశ్రమను ఆదుకునే విధంగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జగన్ టాలీవుడ్ ప్రముఖులకు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ప్రభుత్వానికి, టాలీవుడ్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునేందుకు వీలుగా కమిటీని నియమిస్తామని కూడా జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. దాదాపు గంటన్నర విమాన ప్రయాణం చేసి వచ్చిన టాలీవుడ్ ప్రముఖులు జగన్ తో నలభై నిమిషాలు మాత్రమే సమావేశమయ్యారు.
Next Story

