Fri Apr 03 2026 09:11:47 GMT+0530 (India Standard Time)
జగన్ తో కొనసాగుతున్న సినీ ప్రముఖుల భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ కొనసాగుతుంది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ ప్రారంభమయింది. ప్రధానంగా టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా ప్రస్తావించనున్నారు. టిక్కెట్ల ధరలు ఒక అంశం మాత్రమే. నంది అవార్డుల ప్రకటన, ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధిపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది.
17 అంశాలపై......
మొత్తం 17 అంశాలు ప్రధానంగా జగన్ తో టాలీవుడ్ ప్రముఖులు చర్చించనున్నారు. సినీ రంగానికి సంబంధించిన అనుబంధ పరిశ్రమలను ఏపీలో ఏర్పాటు చేయడంపై కూడా ఈ చర్చలో ప్రధాన అంశం కానుందని తెలిసింది. ఈ సమావేశంలో చిరంజీవి, మహేష్ బాబు, కొరటాల శివ, రాజమౌళి, ఆలీ, పోసాని కృష్ణమురళితో పాటు మంత్రి పేర్ని నాని కూడా పాల్గొన్నారు.
Next Story

