Fri Jan 17 2025 07:54:22 GMT+0000 (Coordinated Universal Time)
TOEFL : టోఫెల్ ప్రిపరేటరీ పరీక్షలకు ఊహించని రెస్పాన్స్.. సర్టిఫికెట్లు జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టోఫెల్ ప్రిపరేటరీ పరీక్షకు మంచి స్పందన విద్యార్థుల నుంచి కనిపించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తెచ్చి విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి పెట్టింది. స్పోకెన్ ఇంగ్లీష్ లో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు నైపుణ్యం ఉండాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో చర్యలు తీసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాన్ని చిన్న నాటి నుంచే పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన టోఫెల్ జూనియర్ పరీక్షకు మంచి స్పందన విద్యార్థుల నుంచి కనిపించింది. ఎక్కువ మంది విద్యార్థులు అనర్గళంగా ఆంగ్లంతో మాట్లాడి ఉత్తీర్ణులు కూడా అయ్యాు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టోఫెల్ కు సంబంధించిన ప్రిపరేటరీ సర్టిఫికేషన్ పరీక్షకు పెద్దయెత్తున స్పందన లభించింది.
ఈరోజు జరిగిన...
ఈరోజు జరిగిన టోఫెల్ ప్రిపరేటరీ సర్టిఫికేషన్ పరీక్షను నేడు నిర్వహించారు. చిన్ననాటి నుంచే విద్యార్థులు రాణించే విధంగా టోఫెల్ ప్రిపరేటరీ పరీక్షను నిర్వహించారు. మూడు నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు ప్రైమరీ స్థాయిలోనూ, ఆరు నుంచి తొమ్మిదో తరగతి వారికి టోఫెల్ జూనియర్ స్థాయిలో పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులయిన వారికి సర్టిఫికేట్లు అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. టోఫెల్ పరీక్షల్లో వినడంతో పాటు చదవడంపైన కూడా పరీక్షను నిర్వహించారు. ఏపీలోని 13,104 పాఠశాలల్లో నిర్వహించిన ఈ పరీక్షకకు మూడు నుంచి ఐదో తరగతి చదువుతున్న 4,53,265 మందివిద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులయిన వారికి సర్టిఫికేట్లు అందచేశారు.
Next Story