Thu Jan 29 2026 14:49:22 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు ప్రకాశం జిల్లా నేతలతో జగన్ సమావేశం
నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశం కానున్నారు

నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతంపై నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్మన్లు కూడా పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలో జిల్లాల పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో జగన్ వరసగా జిల్లాల వారీగా నేతలతో సమావేశాలను నిర్వహిస్తున్నారు.

నేతలకు దిశానిర్దేశం...
తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశంలో స్థానిక సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పోరాటాలు చేయాలని పిలుపు నిచ్చిననేపథ్యంలో వారిని కార్యోన్ముఖులను చేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీని జిల్లాలో ఏ విధంగా బలోపేతం చేయాలన్నదానిపై కూడా వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now
Next Story

