Tue Dec 16 2025 14:16:46 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పవన్ కల్యాణ్ ను కలవనున్న టాలీవుడ్ నిర్మాతలు
ఈరోజు టాలీవుడ్ నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలవనున్నారు.

ఈరోజు టాలీవుడ్ నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలవనున్నారు. మధ్యాహ్నం విజయవాడ లోని క్యాంప్ ఆఫీసులో కలవనున్నారు.కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించి, గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు వివరించి, తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్ కళ్యాణ్ ని సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరించాల్సిందిగా నిర్మాతలు కోరనున్నారు.
సినీ రంగానికి సంబంధించి...
సినిమా టిక్కెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు కల్పించడంతో పాటు, థియేటర్ల సమస్యలు వంటి విషయాలు పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ నిర్మాతలు చర్చించనున్నారు. పవన్ ళ్యాణ్ కలిసే వారిలో టాలీవుడ్ నిర్మాతలు అశ్వినీ దత్, హారిక హాసిని చినబాబు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ,రవిశంకర్, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్,తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షడు దిల్ రాజు,దామోదర్ ప్రసాద్, బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య తదితరులు ఉన్నారని చెబుతున్నారు.
Next Story

