Sun Mar 15 2026 14:58:59 GMT+0530 (India Standard Time)
Tirumala : ఒక్కసారిగా పెరిగిన రద్దీ.. కంపార్ట్మెంట్లు నిండిపోయి.. బయట వరకూ క్యూ లైన్
నేడు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది.

నేడు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బయలుదేరి వస్తున్నారు. వరస సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి...
ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి బయట ఏటీసీ వరకూ క్యూలైన్ విస్తరించి ఉంది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు స్వామి వారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 62,366 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,633 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.01 కోట్ల రూపాయలు వచ్చింది
Next Story

