Tue Jan 21 2025 18:30:09 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఎన్నికల కమిషనర్ ఎదుటకు జిల్లా ఎస్పీలు
నేడు ఎన్నికల కమిషనర్ ఎదుటకు ముగ్గురు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అధికారులు హాజరు కానున్నారు
నేడు ఎన్నికల కమిషనర్ ఎదుటకు ముగ్గురు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అధికారులు హాజరు కానున్నారు. తమ జిల్లా పరిధిలో జరిగిన హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వనున్నారు. ఇప్పటికే ముగ్గురు అధికారులకు రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలు తన ఎదుట హాజరై తమ జిల్లా పరిధిలో జరిగిన ఘటనలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
నివేదిక ఆధారంగా...
వారి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత గిద్దలూరు, ఆళ్లగడ్డ, కారంచేడు వంటి ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఎన్నికల అధికారి ఈ ఆదేశాలను జారీ చేశారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు తన ఎదుట హాజరవ్వాలని జిల్లా ఎస్పీలను ఆదేశించారు. సకాలంలో హింసాత్మక ఘటనలను ఎందుకు నియంత్రించలేకపోయారన్న దానిపై వారి నుంచి వివరణ కోరనున్నారు.
Next Story