Fri Dec 05 2025 15:58:00 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మిధున్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై విచారణ
నేడు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.

నేడు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో ఏ4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఇప్పటికే మధ్యంతర బెయిల్ లభించింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేందుకు వీలుగా మిధున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో ఈ నెల 11వ తేదీన తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలులో సరెండర్ కావాలని ఆదేశించింది.
మధ్యంతర బెయిల్ పై...
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో నలుగురికి బెయిల్ లభించింది. దీంతో మిధున్ రెడ్డి కూడా మధ్యంతర బెయిల్ తో పాటు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. మిధున్ రెడ్డికి అనుకూలంగా వస్తే ఓకే..లేకుంటే పదకొండో తేదీన తిరిగి రాజమండ్రి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.
Next Story

