Thu Mar 19 2026 03:12:37 GMT+0530 (India Standard Time)
Chandrababu : ఐదు నియోజకవర్గాల్లో నేడు చంద్రబాబు
నేడు టీడీపీ అధినేత చంద్రబాబు ఐదు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు

ఎన్నికల ప్రచార సమయం ముగిస్తున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారంలో జోరు పెంచారు. వరసగా ఐదు సభల్లో ఆయన పాల్గొననున్నారు. ఎల్లుండితో శాసనసభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో చంద్రబాబు ఈరోజు విస్తృతంగా ప్రచారం చేస్తూ అధికారపార్టీపై విమర్శలుచేయనున్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించే లక్ష్యంతో చంద్రబాబు పర్యటనలు సాగనున్నాయి.
ప్రజాగళం పేరుతో...
చంద్రబాబు గత నెల రోజుల నుంచి ప్రజాగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నేడు ఐదు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈరోజు చంద్రబాబు ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ప్రజాగళం సభలో ఆయన పాల్గొంటారు.
Next Story

