Wed Dec 17 2025 14:07:07 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు తిరుమలకు చంద్రబాబు నాయుడు
నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుండటంతో చివరి సభను తన సొంత జిల్లా చిత్తూరును ఎంచుకున్నారు. చంద్రబాబు ఏడు పదుల వయసులో గత కొద్ది రోజులుగా చంద్రబాబు అలుపెరగకుండా పర్యటనలు చేస్తున్నారు. వరసగా రోజుకు మూడు నుంచి ఐదు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేశారు.
చిత్తూరు సభతో...
ఈరోజు తొలుత చంద్రబాబు నంద్యాలలో జరిగే ప్రజాగళం సభకు హాజరవుతారు. అక్కడి అభ్యర్థికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తారు. అనంతరం చిత్తూరుకు చేరుకుంటారు. చిత్తూరు తో పాటు కుప్పం నియోజకవర్గంలో చివరిగా ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గత నెలరోజులకు పైగా ప్రజాగళం పేరిట సభలను నిర్వహిస్తూ ఎండలలోనూ బ్రేక్ ఇవ్వకుండా పర్యటనలు చేసిన చంద్రబాబు నేటితో ప్రచారాన్ని ముగించనున్నారు. చిత్తూరు పర్యటన తర్వాత ఆయన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకోనున్నారు.
Next Story

