Sun Mar 15 2026 14:04:36 GMT+0530 (India Standard Time)
Nandamuri Balakrishna : నేడు కర్నూలు జిల్లలో బాలకృష్ణ పర్యటన
నేడు నందమూరి బాలకృష్ణ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన బస్సు యాత్ర నేడు కర్నూలు జిల్లాలో జరగనుంది.

నేడు నందమూరి బాలకృష్ణ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన బస్సు యాత్ర నేడు కర్నూలు జిల్లాలో జరగనుంది. అనేక చోట్ల కార్నర్ మీటింగ్స్ లో ఆయన పాల్గొననున్నారు. ఎమ్మిగనూరులో కూడా జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. బాలకృష్ణ గత కొద్ది రోజులుగా స్వర్ణాంధ్ర సాధన యాత్ర పేరిట బస్సు యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
కార్నర్ మీటింగ్ లతో...
ఎమ్మిగనూరుతో పాటు పలు నియోజకవర్గాల్లో నందమూరి బాలకృష్ణ ప్రసంగించనున్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. రాయలసీమలో నందమూరి బాలకృష్ణకు ఎక్కువ అభిమానులుండంతో ఆయన యాత్ర సీమలో పూర్తిగా విజయవంతం అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Next Story

