Mon Mar 16 2026 20:54:26 GMT+0530 (India Standard Time)
Nara Lokesh : నేడు లోకేష్ ప్రజాదర్బార్
నేడు మంత్రి నారా లోకేష్ ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉండవల్లి నివాసం లో ప్రజా దర్బార్ కార్యక్రమం లో పాల్గొంటారు

నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉండవల్లి నివాసం లో ప్రజా దర్బార్ కార్యక్రమం లో పాల్గొంటారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ప్రజల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా నారా లోకేష్ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్న సంగతి తెలిసింది.
ఉదయం వచ్చిన వారికే...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా దర్బార్ ను నారా లోకేష్ ను నిర్వహిస్తున్నారు. తన దృష్టికి సమస్యలు రాగానే వెంటనే వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నారు. అందుకే ఎక్కువ మంది ప్రజలు ప్రజాదర్బార్ కు వస్తున్నారు. ఈరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపు వచ్చిన వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని మంత్రి లోకేష్ కార్యాలయం తెలిపింది.
Next Story

