Sun Mar 22 2026 15:24:06 GMT+0530 (India Standard Time)
రెండు రోజులు పాదయాత్రకు విరామం
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు మహాపాదయాత్ర నేడు 39వ రోజుకు చేరుకుంది.

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు మహాపాదయాత్ర నేడు 39వ రోజుకు చేరుకుంది. చిత్తూరు జిల్లాలో ప్రవేశించిన యాత్ర నేడు శ్రీకాళహస్తి నుంచి బయలుదేరనుంది. ఈరోజు మధ్యాహ్నం రైతుల మహాపాదయాత్రకు విరామం ప్రకటించనున్నారు. రేపు కూడా విరామం ప్రకటించే అవకాశముంది.
హైకోర్టు తీర్పు కోసం....
తిరుపతిలో బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో రైతులు హైకోర్టును ఆశ్రయించనున్నారు. హైకోర్టు తీర్పు కోసం పాదయాత్రను ఈరోజు మధ్యాహ్నం నుంచి విరామం ప్రకటించాలని నిర్ణయించారు. కోర్టు తీర్పును అనుసరించి ఎల్లుండి నుంచి తిరిగి మహా పాదయాత్ర ప్రారంభం కానుంది.
Next Story

