Fri Dec 05 2025 16:51:28 GMT+0000 (Coordinated Universal Time)
మరికాసేపట్లో బెజవాడలో బీసీ సభ
నేడు జయహో బీసీ సభ విజయవాడలో జరగనుంది. వైఎస్సార్సీపీ నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమానికి ఇప్పటికే వేలాది మంది తరలి వచ్చా

నేడు జయహో బీసీ సభ విజయవాడలో జరగనుంది. వైఎస్సార్సీపీ నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమానికి ఇప్పటికే వేలాది మంది తరలి వచ్చారు. ఉదయం 9 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. రాష్ట్రం నలుమూలల నుంచి ఎనభై వేల మందికి పైగా ప్రతినిధులు సభకు హాజరయ్యారు. ఇందుకోసం వైఎస్సార్సీపీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. వెనుకబడిన వర్గాలే వెన్నుమక అనే నినాదంతో అధికార వైసీపీ ఈ సభను నిర్వహిస్తుంది. ముఖ్యమంత్రి జగన్ బీసీలకు మరిన్ని వరాలు ప్రకటించే అవకాశముందని చెబుతున్నారు.
80 వేల మంది....
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొననున్నారు. బీసీ ప్రతినిధులను ఆహ్వానిస్తూ పెద్దయెత్తున ఫ్లెక్సీలు విజయవాడ నగరమంతా వెలిశాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఏం చేశాం? భవిష్యత్ లో ఏం చేయబోతున్నామన్నది మంత్రులు వివరించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ సయితం వచ్చే ఎన్నికల్లో బీసీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏం చేయాలన్న దానిప ప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story

