Fri Mar 20 2026 02:05:49 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్
తిరుమల శ్రీవారి భక్తులకు నేడు శుభవార్త. నేడు తిరుమలలోని శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది

తిరుమల శ్రీవారి భక్తులకు నేడు శుభవార్త. నేడు తిరుమలలోని శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. నవంబర్ నెలకు సంబంధించిన ఈ టిక్కెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. అలాగే లక్కీడిప్ విధానంలో కేటాయించే టిక్కెట్లను కూడా విడుదల చేయనుంది.
నేటి నుంచి...
నేటి నుంచి ఎల్లుండి వరకూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఎల్లుండి లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టిక్కెట్లను కేటాయించనున్నారు. ఈరోజు తిరుమలలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీవారి గరుడ సేవ జరగనుంది. రాత్రి ఏడు గంటలకు గరుడ వాహనంపై మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు.
Next Story

