Thu Mar 19 2026 20:51:34 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవం
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం కావడంతో ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలను నిర్వహించనుంది

ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం కావడంతో ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలను నిర్వహించనుంది. ముఖ్యమంత్రి జగన్ సీఎం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొంటారు. ఉదయం 10.15 గంటలకు పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జగన్ మోహన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
పాల్గొననున్న సీఎం...
అనంతరం తెలుగుతల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ ఎ కన్వెన్షన్ సెంటర్ కు బయలుదేరి వెళతారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్.పిలు రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో పాల్గొంటారు. జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
Next Story

