Sat Jan 31 2026 21:29:13 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ దళిత గర్జనకు నో పర్మిషన్
నేడు విజయవాడలో టీడీపీ దళిత గర్జనను పోలీసులు అడ్డుకుంటున్నారు. అనేక మంది టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు

నేడు విజయవాడలో టీడీపీ దళిత గర్జనను పోలీసులు అడ్డుకుంటున్నారు. అనేక మంది టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాలను సాధించడం కోసం టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నేడు విజయవాడంలో దళిత గర్జన సభను ఏర్పాటు చేసింది. వివిధ జిల్లాల నుంచి విజయవాడ ధర్నా చౌక్ కు దళితులు రావాలని పిలుపునిచ్చింది.
అనుమతి లేదంటూ...
అయితే దళిత గర్జన సభకు పోలీసుల అనుమతి లేదని నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెక్షన 30తో పాటు 144వ సెక్షన్ అమలులో ఉందని పోలీసులు తెలిపారు. టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజును పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు అనుమతించకపోతే తాము ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆందోళనకారులు చెబుతున్నారు.
Next Story

